లేటెస్ట్…గేమ్ చేంజర్ ఓటిటి పార్ట్ నర్ ఫిక్స్!

లేటెస్ట్…గేమ్ చేంజర్ ఓటిటి పార్ట్ నర్ ఫిక్స్!

Published on Mar 19, 2024 9:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ (Game changer). ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖని, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు