ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన సూర్య ‘గ్యాంగ్’ !

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తమిళ చిత్రం ‘తాన సెరెంద కూట్టం’ తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో జనవరి 12 నాడే రిలీజ్ కానుంది. చిత్రంపై మొదటి నుండి మంచి బజ్ ఉండటంతో తెలుగునాట స్ట్రాంగ్ రిలీజ్ దక్కనుంది. దీంతో చిత్రాన్ని ఇంకాస్త ప్రభావంతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో యూనిట్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది.

ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. దీనికి సూర్యతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు విగ్నేష్ శివన్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ హాజరుకానున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పిస్తోంది.