టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం గతేడాది థియేటర్ల లోకి రావాల్సి ఉండగా, వాయిదా పడింది. మే 17 న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వాయిదా వేస్తూ మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.
ఈ చిత్రంను మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.