విజయ్ 64 ఎలా ఉండబోతుందంటే..

విజయ్ 64 ఎలా ఉండబోతుందంటే..

Published on Oct 2, 2019 12:23 AM IST

Vijay2

తమిళ స్టార్ హీరో విజయ్ తన 64వ సినిమాను లోకేష్ కనగరాజ్ అనే యువ దర్శకుడితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రాజెక్ట్ గురించి టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తుండటం, మంచి నటీ నటులు నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో సాధారణ స్థాయికి మించి అమితమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉంటుందని, హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. దీంతో విజయ్ అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. ఇప్పటివరకు ఇంతవరకే తెలిసినా ఇంకొద్ది రోజుల్లో పూర్తి సమాచారం బయటకురానుంది.

ఇకపోతే ఇందులో స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర చేస్తుండటం మరొక పెద్ద విశేషం. ఎక్స్.బి ఫిల్మ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 2020 వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు