ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – 11 ఏళ్ళ తర్వాత గౌతమ్ మీనన్ మెసేజ్ చేసి పొగిడారు !
Published on Jul 12, 2017 3:20 pm IST


తెలుగు, తమళం అనే తేడా లేకుండా మంచి కథలు, దర్శకులు దొరికితే సినిమాలు చేస్తూ రెండు పరిశ్రమల్లోను మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ శుక్రవారం ఆయన నటించిన ‘శమంతకమణి’ విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన సినిమా సంగతుల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘శమంతకమణి’లో మీ పాత్రేమిటి ?
జ) ఈ సినిమాలో నా పాత్ర పేరు కోటిపల్లి శివ. థియేటర్ నడుపుకునే కుర్రాడు. అతనికో ఫైల్యూర్ లవ్ స్టోరీ. మంచి మాస్ క్యారెక్టర్. ఎంటర్టైనింగా కూడా ఉంటుంది.

ప్ర) మీకు జోడీగా ఎవరు నటిస్తున్నారు ?
జ) ఇందులో నాకు ఇద్దరు హీరోయిన్లు. ఒకరు అనన్య. ఆమె మిస్ ఆస్ట్రేలియా. ఇంకొకరు జెన్నీ. ఈమె తెలుగమ్మాయి.

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీరామ్ ఆదిత్య ముందుగా మంచి స్క్రిప్ట్ ను తయారుచేసుకోవడం వలన సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుడికి కనెక్టయ్యే విధంగా ఉంటుంది. నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవుతుంది.

ప్ర) ప్రస్తుతం ఏయే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ?
జ) ఇప్పుడు మూడు సినిమాలు నడుస్తున్నాయి. ఒకటి కునాల్ కోహ్లీ సినిమా, ఇంకొకటి కార్తిక్ నరేన్ ‘నరకాసురుడు’, ఇంకొకటి మంజులగారి సినిమా. కృష్ణ వంశీగారితో చేస్తున్న ‘నక్షత్రం’ పూర్తైపోయింది.

ప్ర) కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నిజంగా ఆయనతో జర్నీ నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఆయన్నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన పరిచయం వలన నాలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకూ ముందు కొంచెం కోపం, విసుగు, లోపల కొంచెం ఈర్ష్య లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడవన్నీ పూర్తిగా పోయాయి. లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది.

ప్ర) ఆయన సెట్స్ లో నటుల్ని చాలా కష్టపెట్టేవారని అంటారు ?
జ) అది కష్టపెట్టడం కాదు. ఆయన స్టైలే అది. స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉండేవారు. ప్రతిదీ పక్కాగా చేసేవారు. అందుకే అంత గొప్ప దర్శకుడయ్యారు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. నిజంగా ఆయనకు చాలా రుణపడి ఉన్నాను.

ప్ర) తమిళంలో చేస్తున్న సినిమాలు గురించి చెప్పండి ?
జ) తమిళంలో రీసెంట్ గా చేసిన ‘మానగరం’ అక్కడ నాకు మంచి పేరు తెచ్చింది. నా కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు ఆ సినిమా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు కార్తిక్ నరేన్ తో చేస్తున్న ‘నరకాసురుడు’ కూడా మంచి సినిమా. గౌతమ్ మీనన్ గారు ప్రొడ్యూసర్. దాదాపు 11 ఏళ్ల తర్వాత గౌతమ్ మీనన్ నాకు మెసేజ్ చేసి నువ్వు గొప్ప పొజిషన్లో ఉన్నందుకు, మంచి సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు.

ప్ర) కునాల్ కోహ్లి సినిమా ఎలా వచ్చింది ?
జ) పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన ఆయన నాతో చేయడం మర్చిపోలేని అనుభూతి. అదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. అంటే స్టడీసీ కెమెరాతో మన లైఫ్ ని షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయనలాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఫీలవుతున్నాను.

ప్ర)‘శమంతకమణి’ లో నలుగురు హీరోలు కదా ఎప్పుడైనా ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే ఫీలింగ్ కలిగిందా ?
జ) లేదు. అస్సలు కలగలేదు. డైరెక్టర్ శ్రీరామ్ మమ్మల్ని అలా హ్యాండిల్ చేశాడు. నిర్మాతలు కూడా అందరినీ ఒకేలా చూసుకున్నారు. సెట్స్ లో ప్రతి హీరోకి ఒక్కో క్యారవాన్ ఏర్పాటు చేసేవారు. ఇక సినిమాలో పాత్రలు కూడా సమానంగానే ఉంటాయి.

ప్ర) ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా లుక్స్ పరంగా ఇబ్బంది రాలేదా ?
జ) నేను ఒక సినిమా తర్వాతే ఇంకో సినిమా చేస్తూ వచ్చాను. పైగా ఇంతకూ ముందు చేసిన ‘నక్షత్రం, శమంతకమణి’ లు మాస్ సినిమాలు కాబట్టి రెండింటిలోనూ లుక్స్ పరంగా ఒకేలా ఉంటాను. అలాగే ఇప్పుడు చేస్తున్న కునాల్ కోహ్లి, మంజుల సినిమాల్లో అర్బన్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తాను. కాబట్టి లుక్స్ పరంగా ఈ నాలుగు సినిమాలకి ఈనాటి ఇబ్బందీ లేదు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook