‘బాలయ్య’ 100వ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ !
Published on Aug 11, 2016 8:55 am IST

Gautamiputra-Satakarni
‘నందమూరి బాలకృష్ణ’, దర్శకుడు ;క్రిష్’ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం క్రిష్ పెళ్లి వేడుకల కారణంగా బ్రేక్ లో ఉంది. ఈ చిత్రంపై దర్శకుడు క్రోశ మాట్లాడుతూ చిత్రం దాదాపు 40 % షూటింగ్ ను పూర్తి చేసుకుందని, సినిమా ఇప్పటి వరకూ చాలా అద్భుతంగా వచ్చిందని, ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అలాగే ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలుకానుందని కూడా క్రిష్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి క్రిష్ చివరి చిత్రం ‘కంచె’ కు సంగీతం అందించిన ‘చిరంతన్ భట్’ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ‘శ్రీయ’ హీరోయిన్ గా నటిస్తోంది. ‘రాజీవ్ రెడ్డి, క్రిష్’ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

 
Like us on Facebook