17 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయనున్న గౌతమ్ మీనన్, మాధవన్ !
Published on Feb 21, 2018 9:25 am IST

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, నటుడు మాధవన్ ల కలయికలో 2001లో వచ్చిన ‘మిన్నాలే’ (చెలి) చిత్రం మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మళ్ళీ సినిమా చేయని వీళ్ళు దాదాపు 17 ఏళ్ల తర్వాత గౌతమ్ మీనన్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘విన్నైతాండి వరువాయ'(ఏమాయ చేసావే) సీక్వెల్ కోసం చేతులు కలిపారు.

‘విన్నైతాండి వరువాయ’ 10 ఏళ్ల తర్వాత ప్రారంభమయ్యే కథగా ఈ సీక్వెల్ ఉండనుంది. మొదటి భాగంలో ప్రేమ కోణాన్ని చూపిన గౌతమ్ మీనన్ ఇందులో స్నేహం అనే అంశాన్ని ఎలివేట్ చేస్తారని వినికిడి. ఇందులో మాధవన్ స్నేహితులుగా మరో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించే అవకాశాలున్నాయట. ఈ కొనసాగింపుకు కూడ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

మరి ఈ ప్రాజెక్టును గౌతమ్ మీనన్ ‘ఏమాయ చేసావే’ తరహాలోనే తెలుగులోకి రీమేక్ చేస్తారా లేదా, ఒకవేళ చేస్తే ఎవరితో చేస్తారు అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు.

 
Like us on Facebook