అజిత్ ‘తునీవు’ సెకండ్ సాంగ్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన జీబ్రాన్

అజిత్ ‘తునీవు’ సెకండ్ సాంగ్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన జీబ్రాన్

Published on Dec 14, 2022 12:35 AM IST


తలా అజిత్ కుమార్ హీరోగా మంజు వారియర్ ప్రధాన పాత్రలో హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటెర్టైనర్ మూవీ తునీవు. ఈ సినిమాలో అజిత్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి ప్రఖ్యాత సంస్థ జీ స్టూడియోస్ వారు తునీవు మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. 2023 సంక్రాతి సందర్భంగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న ఈ మూవీ పై అటు అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఇటీవల ఈ మూవీ నుండి చిల్లా చిల్లా అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అనిరుద్ పాడిన ఈ సాంగ్ కి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ అతి త్వరలో రిలీజ్ చేయనున్నామని, అలానే ఈ సాంగ్ మనీ మీద సాగుతుందని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అజిత్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ అందించారు జీబ్రాన్. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన తునీవు మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి ప్రఖ్యాత సంస్థ జీ స్టూడియోస్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు