‘ధృవ’ ఔట్ ఫుట్ చాలా బాగుంటుందట !

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘ధృవ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం యూనిట్ హైదరాబాద్ లో షెడ్యూల్ జరుపుతోంది. ఈ షెడ్యూల్లో చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కొద్ది రోజుల నుండి విలన్ క్యారెక్టర్ చేస్తున్న అరవింద స్వామి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం కావడంతో చెర్రీ సినిమా అన్ని విధాలా బాగుండేలా చూస్తున్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూనిట్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు చేసిన ఘాటింగ్ అవుట్ ఫుట్ చాలా బాగుందని, హీరో, దర్శక నిర్మాతలు ఔట్ ఫుట్ పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. తమిళంలో జయం రవి నటించిన ‘తనీ ఒరువన్’ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి ‘ధృవ’ కథను సిద్ధం చేశారు. ఇకపోతే దసరా కానుకగా రావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు.