మంచి ధర పలికిన ‘రాజా ది గ్రేట్’ హక్కులు !


మాస్ మహారాజ రవితేజ చేస్తున్న రెండు చిత్రాల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా ది గ్రేట్’ ముందుగా విడుదలకానుంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఆసక్తికరమైన టీజర్ తో మంచి బజ్ క్రియేట్ అవడంతో ఈ చిత్ర హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ ఒకటి ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని మంచి ధరకు కొనుగోలుచేయగా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది.

అలాగే హిందీ డబ్బింగ్ హక్కులు కూడా ఉత్తమమైన డీల్ కు అమ్ముడైనట్టు సంచారం. మొత్తంగా ఈ మూడు రకాల రైట్స్ కలిపి సుమారు రూ. 18 కోట్లు పలికినట్టు సమాచారం. ఈ మొత్తంతో నిర్మాతలకు చాలా మేలు జరిగిందనే చెప్పొచ్చు. రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్న ఈ కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 12న విడుదలకానుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది.