“ఆడవాళ్ళు మీకు జోహర్లు” టైటిల్ సాంగ్ కి విశేష స్పందన

Published on Feb 8, 2022 12:40 pm IST

శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం ను సుధాకర్ చెరుకూరి గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటకు యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పాటకు 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా లో సైతం ఈ పాట కి విశేష స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ, ఝాన్సీ, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సత్య కృష్ణ, బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :