గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

‘ఆక్సిజన్’ సినిమా తరువాత గోపీచంద్ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ‘పంతం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు.

బెంగాల్ టైగర్ సినిమా నిర్మించిన కె.రాదామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ డైనమిక్ గా కనిపించబోతున్నాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో గోపీచంద్ విజయం సాధించాలని కోరుకుందాం.