వేంకటేష్ ‘గురు’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

Venkatesh
విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గురు’. హిందీ సినిమా ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో వెంకీ అగ్రెసివ్ గ ఉండే బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కూడా ఒరిజినల్ వర్షెన్ ను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క మాధవన్ స్థానంలో వెంకటేష్ నటించడం మినహా ఈ ప్రాజెక్టులో పెద్దగా ఎలాంటి మార్పులు జరగలేదు.

ఇకపోతే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా వెంకటేష్ ఈ చిత్రం కోసం బాడీ బిల్డింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ ఘాటింగ్ ఈ వారాంతంలో మొదలవుతుంది. సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.