త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల సినిమా కన్ఫర్మ్

2nd, September 2016 - 10:31:42 AM

pawan-trivikram
పవన్ కళ్యాణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్టవుతుంది అనే ప్రశ్న వస్తే వినిపించేది త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే. సినిమా పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులైన పవన్, త్రివిక్రమ్ ల ఆలోచనా విధానం చాలా వరకూ ఒకే విధంగా ఉంటుంది కనుక వారి కాంబినేషన్లో సినిమా వస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని, ఖచ్చితంగా హిట్టవుతుందని అభిమానుల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారమే ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలు భారీ విజయాల్ని సాదించాయి.

ఒక రకంగా చెప్పాలంటే ‘అత్తారింటికి దారేది’ తరువాత పవన్ కు సరైన హిట్ లేదు. అందుకే అభిమానులు మరొక్కసారి పవన్ – త్రివిక్రమ్ కాంబో రిపీటైతే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. వారి కోరికను నిజం చేస్తూ పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో సినిమా రాబోతోంది. హారికా – హాసిని క్రియేషన్స్ సంస్థ కొద్దిసేపటి క్రితమే తమ 4వ చిత్రం పవన్ – త్రివిక్రమ్ ల కలయికలోనే ఉంటుందని ప్రకటించింది. ఈ ప్రస్తుతం డాలీతో పవన్ చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా పూర్తవగానే చిత్రం మొదలవుతుందని తెలుస్తోంది.