ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా అందుబాటులోకి రానున్న ‘హను మాన్’

ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా అందుబాటులోకి రానున్న ‘హను మాన్’

Published on Mar 26, 2024 12:35 AM IST

తేజ సజ్జ, అమృత అయ్యర్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ హను మాన్ ఇటీవల ఈ మూవీ థియేటర్స్ లో ఎంతటి గొప్పగా కలెక్షన్ రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా కీలక పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను నటించారు. విషయం ఏమిటంటే, ఇటీవల మొదట జియో సినిమా ద్వారా హిందీ వర్షన్ లో ఓటిటిలో అందుబాటులో వచ్చిన హను మాన్ మూవీ, నార్త్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. అనంతరం మరొక ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు వర్షన్ అందుబాటులోకి రాగా తెలుగులో కూడా బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, తాజాగా మరొక ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 5 నుండి ఆయా భాషల్లో హను మాన్ స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా డిస్నీ వారు ప్రకటించారు. ఇక ఈ భాషల నుండి కూడా మూవీ మంచి స్పందన అందుకునే అవకాశం కనపడుతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నిర్మితం అయిన ఈ మూవీ అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు