ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో “హను మాన్” హవా

ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో “హను మాన్” హవా

Published on Mar 23, 2024 9:01 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ యంగ్ నటి అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie). మరి మన తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ అయ్యి దాదాపు రెండు నెలలు తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

మరి ఈ చిత్రం జీ5 ఓటిటిలో వచ్చాక గంటల్లోనే మిలియన్స్ కొద్దీ స్ట్రీమింగ్ మినిట్స్ ని నమోదు చేసింది. మరి ఈ చిత్రం ఇప్పుడు ఇదే రేంజ్ లో రికార్డు రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 5 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈ చిత్రం అదరగొట్టేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం మిగతా సౌత్ భాషల్లో అతి త్వరలోనే రిలీస్ కానుంది. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు