ఓటిటి లో ‘హను మాన్’ సెన్సేషనల్ రికార్డు

ఓటిటి లో ‘హను మాన్’ సెన్సేషనల్ రికార్డు

Published on Mar 18, 2024 10:00 PM IST

ఇటీవల తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అనంతరం సూపర్ సక్సెస్ అయి భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, నిన్న ఈమూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 లో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ తో కొనసాగుతోంది. రిలీజ్ అయిన కేవలం 11 గంటల్లో జీ 5 లో గ్లోబల్ గా 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సెన్సేషనల్ గా దూసుకెళుతోందని జీ 5 టీమ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ విధంగా అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో తమ హను మాన్ మూవీ అత్యద్బుతంగా పెర్ఫార్మ్ చేస్తుండడం ఆనందంగా ఉందని అంటోంది మూవీ టీమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు