ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న హ్యాపెనింగ్ హిట్ “సామ్ బహదూర్”

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న హ్యాపెనింగ్ హిట్ “సామ్ బహదూర్”

Published on Jan 23, 2024 9:00 AM IST


గత ఏడాదిలో బాలీవుడ్ సినిమా ఎలాంటి హిట్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. పఠాన్ మొదలుకొని డిసెంబర్ నెల వరకు కొద వరుస భారీ హిట్స్ తో బాలీవుడ్ మంచి కం బ్యాక్ ఇవ్వగా అక్కడ చిన్న చిత్రాలుగా వచ్చినవి కూడా చాలానే బాక్సాఫీస్ పరంగా మంచి హిట్ అయ్యాయి.

మరి ఈ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా మేఘన గుజార్ దర్శకత్వంలో తెరెకక్కించిన చిత్రం “సామ్ బహదూర్” కూడా ఒకటి. మరి ఇండియన్ గ్రేటెస్ట్ సోల్జర్ సామ్ బహదూర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ హిట్ అయ్యి అయ్యి బాలీవుడ్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ బలంగా నిలిచి మంచి హ్యాపెనింగ్ చిత్రంగా మారింది.

దీనితో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తున్నవారికి ఫైనల్ గా ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ఇపుడు ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా కోసం చూస్తున్న వారు అప్పుడు వరకు ఆగితే సరిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు