పవర్ స్టార్ తో హరీష్ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Sep 27, 2020 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ కొన్ని నిముషాల పాటు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట. అయితే ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో మాత్రమే పవన్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

కాగా ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమాలో కూడా పోలీస్ సీక్వెన్స్ ఉందనే సరికి ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి . పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ కారణంగా ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించవచ్చే అవకాశం ఉందట. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More