చిరంజీవి కూడా నా పెళ్ళికి వస్తాడు…హీరో కార్తికేయ కీలక వ్యాఖ్యలు!

Published on Nov 23, 2021 9:20 pm IST

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది సినీ పరిశ్రమ కి వస్తున్నవారిని మనం చూస్తున్నాం. అయితే అందులో హీరో కార్తికేయ కూడా ఉన్నారు. తాజాగా హీరో కార్తికేయ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

నేను పెద్దయ్యాక హీరో అవుతా, అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్ళికి వస్తాడు అని కార్తికేయ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నేను చాలా అమాయకమైన పిల్లాడి గా ఉన్నప్పుడు ఇది చెప్పాను, విధికి ధన్యవాదాలు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీర్వదించారు అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పై తన ప్రేమను వెల్లడించారు కార్తికేయ. హీరో కార్తికేయ తను ప్రేమించిన అమ్మాయి లోహిత ను పెళ్ళిచేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ఎంతో మంది సినీ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యి వారిని ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కార్తికేయ తన సంతోషాన్ని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :