సాయిధరమ్‌ తేజ్ ఐసీయూ వీడియో.. నిఖిల్ సీరియస్..!

Published on Sep 14, 2021 2:28 am IST


మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ మొన్న శుక్రవారం నాడు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన వెంటనే తొలుత సాయితేజ్‌ను మాదాపూర్‌లోని మెడికోర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో సాయిధరమ్‌ తేజ్‌కు కొద్దిసేపు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరుణంలో సాయితేజ్‌ని స్పృహలోకి తెచ్చేందుకు ఓ డాక్టర్ ప్రయతిస్తూ ‘కళ్లు తెరవండి.. ఇటు చూడండి అంటూ భుజం తట్టి లేపుతున్న వీడియో బయటకు వచ్చింది.

అయితే ఈ వీడియోపై యంగ్ హీరో నిఖిల్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఓ వ్యక్తి ఆస్పత్రి ఐసీయూలో ఉన్నప్పుడైనా ఆ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వండని కోరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయితేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు సాయితేజ్‌కి కాలర్‌ బోన్‌ శస్త్రచికిత్స జరగ్గా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :