ఆ స్టార్ హీరోతో మల్టిస్టారర్ చెయ్యాలని ఉందన్న రవితేజ !
Published on Oct 25, 2017 11:20 am IST

తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ రెండేళ్ల విరామం తరువాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ ఎంటర్టైనర్ గా పాస్ మార్కులు కొట్టేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లతో నడుస్తోంది. ఈ సినిమాతో పాటే విక్రమ్ సిరి దర్శకత్వంలో మాస్ మహారాజ మొదలుపెట్టిన ‘టచ్ చేసి చూడు’ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

ఇకపోతే తాజాగా రవితేజ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. మీరు మల్టీ స్టారర్ సినిమా చేస్తే తెలుగులో ఏ హీరోతో చేస్తారు ? అనే ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని ఉంది అని, అతని కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుందని, మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది అంటూ మనసులో మాటను బయటపెట్టారు. రవితేజ కోరుకున్నట్లు గానే పవన్ తో సినిమా చేద్దామని ఏ డైరెక్టర్ అయినా మంచి స్క్రిప్ట్ తో వస్తే బాగుంటుంది కదా !

 
Like us on Facebook