“భళా తందనాన” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on May 2, 2022 12:00 am IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భళా తందనాన. ఈ చిత్రానికి దర్శకుడు చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 6 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో హీరోయిన్ గా కేథరిన్ థెరిస్సా నటిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వారాహి చలన చిత్రం వారు నిర్మాణం వహిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సర్ సిఆర్ రెడ్డి కన్వోకేషన్ హాల్, సిరిపురం వైజాగ్ లో నిర్వహించడం జరిగింది. విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వేడుక లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

హలో వైజాగ్, ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థాంక్స్. ఈ చిత్రం భళా తందనాన స్టార్ట్ అవ్వడానికి కారణం, వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటి గారు. ఇంత డేరింగ్ ప్రొడ్యూసర్ ను చూడటం ఇదే ఫస్ట్ టైమ్. ఇదే లాస్ట్ టైం కూడా అవుతుందేమో. ఇంతకుమించి డేరింగ్ ఇంకా ఎవరిని కలవలేదు. ప్రొడ్యూసర్ అంటే డేర్ ఉండాలి, అది ఆయనకి ఫుల్ గా ఉంది. సినిమా పరంగా, టెక్నీషియన్ల పరం గా చాలా సాటిస్ఫై అయ్యాము. 14 ఏళ్ల నుండి నేను చైతన్య ఫ్రెండ్స్. 14 ఏళ్ల తర్వాత మళ్లీ పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. సినిమాల్లోకి వెళ్ళడానికి ప్రోత్సహించిన వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం.

ఈ చిత్రం లో హీరోయిన్ కేథరిన్ చాలా బాగా చేసింది. తన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. గరుడ రామ్ గారు, కేజీఎఫ్ చిత్రం తో ఇండియాలోనే టాప్ విలన్ అయిపోయారు. నేను హీరో అన్నప్పుడు గరుడ రామ్ నాకు ఆపోజిట్ అంటే ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. అందుకే సాయి ను ఇందాక డేరింగ్ అన్నది. కేజీఎఫ్ తర్వాత ఈ చిత్రానికి అదే రేంజ్ లో క్రేజ్ వస్తుంది. మణిశర్మ సాంగ్స్ అన్నీ బావున్నాయి, ఆర్ ఆర్ అదిరిపోతుంది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్. మే 6 న ధియేటర్ల లోకి వస్తున్నాం, తప్పకుండా చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :