‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీకాంత్

‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీకాంత్

Published on Oct 7, 2026 7:00 AM IST

దర్శకుడు కే. దశరథ్ సమర్పణలో తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు.

​టైటిల్ భిన్నంగా ఉందని, చిత్రం మంచి విజయం సాధించి బృందానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాంత్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

​17 ఏళ్ల క్రితం గాంధీ జయంతి నాడే శ్రీకాంత్ నటించిన ‘మహాత్మా’ సినిమా విడుదలై ఘన విజయం సాధించిందని దర్శకుడు తల్లాడ సాయికృష్ణ గుర్తుచేశారు. అదే రోజున ఆయన చేతుల మీదుగా తమ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయించడం సంతోషంగా ఉందని చెప్పారు.

​శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

​ఈ చిత్రంలో ఏకాదంతాయ సిరి, వాసు ఇంటూరి, పృథ్వీ, శ్రీలక్ష్మి, జబర్దస్త్ జీవన్, కిషోర్ దాస్, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, వినోద్ నువ్వుల తదితరులు నటిస్తున్నారు. జీవన్ కందుల రచన అందించిన ఈ చిత్రానికి శివ రాథోడ్ ఛాయాగ్రహణం, మోహన్ కూర్పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తాజా వార్తలు