కొడుకు ఎంట్రీ కోసం కథలు వింటున్న స్టార్ హీరో !

Published on Jun 20, 2022 2:02 pm IST


తమిళ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌ తన కొడుకు జాసన్ ను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ తన గురించి మాట్లాడుతూ.. తన కుమారుడితో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ముఖ్యంగా జాసన్ సినీ ఎంట్రీ గురించి చెబుతూ.. ‘జాసన్ కి తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే హక్కు ఉంది. నేనైతే నా కొడుకు సినిమాలే చేయాలని అనుకోను. తన పై నేను ఎప్పుడూ ఒత్తిడి చేయను.

అయితే, తను నటుడవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి, నేను ఖచ్చితంగా సపోర్టు చేస్తాను’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ తన కుమారుడి కోసం కొత్త కథలు వింటున్నాడు. తన కొత్త సినిమాలో గెస్ట్ రోల్ ను కూడా తన కొడుకు కోసం డిజైన్ చేయిస్తున్నాడట. ఇక ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘బీస్ట్’ సినిమా బాగానే హిట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :