మల్టీ స్టారర్ సినిమాలో నానికి హీరోయిన్ ఖరారు ?
Published on Feb 26, 2018 5:16 pm IST

నాగార్జున, నానిల మల్టీ స్టారర్ సినిమా రీరికార్డింగ్ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో నాని డాక్టర్ పాత్రలో, నాగార్జున డాన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా ప్రారంభంకానుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఈ మూవీలో నాగార్జున సరసన నటించబోతోంది.

తాజా సమాచారం మేరకు నానికి జోడీగా మాళవిక శర్మ నటించనుందని తెలుస్తోంది. మాళవిక శర్మ ప్రస్తుతం రవితేజ ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తోంది. కామెడి ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. వర్మ సినిమాలో బిజీగా ఉన్న నాగార్జున ఆ సినిమా పూర్తయిన తరువాత శ్రీరామ్ ఆదిత్య సినిమాలో జాయిన్ కాబోతున్నాడు.

 
Like us on Facebook