హీరోయిన్ ను రిపీట్ చెయ్యబోతున్న రామ్ !
Published on Nov 20, 2017 9:25 pm IST

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో రామ్ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమా నిర్మించబోతున్నాడు. సినిమా చూపిస్తా మావ, నేను లోకల్ లాంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు వచ్చిందని సమాచారం. దేవినే ఈ సినిమాకు సంగీతం అందించాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ప్రకటించబోయే ఈ సినిమాకు ప్రసన్న కుమార్ మాటలు అందిస్తున్నారు. రామ రామ కృష్ణ కృష్ణ సినిమా తరువాత దిల్ రాజుతో రామ్ చేస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

 
Like us on Facebook