రజినీ “అన్నాత్తే” టీజర్ పై భారీ అంచనాలు.!

Published on Oct 13, 2021 8:01 am IST

తలైవర్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అన్నాత్తే”. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున ఈ భారీ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ కాగా దీని నుంచి మేకర్స్ టీజర్ కి ముహూర్తం కుదిర్చారు. ఈ అక్టోబర్ 14 న సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చెయ్యగా ఈ టీజర్ పై ఇప్పుడు సమయం గడుస్తున్నా కొద్దీ మరిన్ని అంచనాలు నెలకొంటున్నాయి.

దాదాపు అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మళ్ళీ వింటేజ్ రజినీని చూసే విధంగా అదిరే బ్యాక్ డ్రాప్ తన స్టైల్ మ్యానరిజం లు కనిపిస్తాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా టీజర్ పట్ల త్వరగా చూసేందుకు అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. అలాగే దర్శకుడు శివ టేకింగ్ పై కూడా అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ వచ్చే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా డి ఇమన్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :