జనవరిలో ప్రారంభం కానున్న హిట్ కాంబినేషన్ !

అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుడిగాడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. జనవరి నుండి మళ్ళి ఈ కాంబినేషన్ సినిమా మొదలు కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

‘సుడిగాడు’ సినిమాకు సంగీతం అందించిన శ్రీ వసంత్ ఈ మూవీకి వర్క్ చెయ్యడం విశేషం. అల్లరి నరేష్ కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు. కథ, కథనాలు నచ్చడంతో ఈ స్క్రిప్ట్ కు నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నరేష్ కు ఈ ప్రాజెక్ట్ తో పాటు మరికొన్ని సినిమాలు డిస్కర్షన్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలో మిగితా సినిమాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది’. హిట్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మంచి విజయవంతం అవ్వాలని కోరుకుందాం.