“RRR” పై ప్రముఖ హాలీవుడ్ రైటర్ నాన్ స్టాప్ ప్రశంసలు.!

“RRR” పై ప్రముఖ హాలీవుడ్ రైటర్ నాన్ స్టాప్ ప్రశంసలు.!

Published on May 31, 2022 5:17 PM IST

మన టాలీవుడ్ సినిమా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా కూడా గర్వించదగ్గ మరో భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి విజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరి బిగ్గెస్ట్ స్టార్స్ డెడికేషన్ తోడైతే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ బార్క్ సినిమా రుచి చూపించింది.

అయితే ఈ సినిమా పై మన దగ్గర మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియెన్స్ నుంచి కూడా ఎంతో ఆదరణ, అప్లాజ్ లభించింది. ఇక లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్స్ వారి కామిక్స్ కి గాను రైటర్ గా చేస్తున్న ఆరోన్ స్టీవర్ట్ ఈ సినిమాపై నాన్ స్టాప్ గా ప్రశంసలు కురిపించాడు.

ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి 20 నిమిషాలకు ఓ రేంజ్ హై వస్తుందని సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని డైరెక్టర్ రాజమౌళి అదిరే లెవెల్లో తీసారని నేను ఇప్పటికీ బెట్ వేస్తాను వచ్చే పదేళ్లలో ఒక మర్వెల్ సినిమాలో ఇలాంటి డాన్స్ స్టెప్స్ ఉండే సినిమా వస్తుందేమో కానీ ఇలా ఉండకపోవచ్చు అంటూ ఎగ్జైట్మెంట్ ని అంతా ఓ రేంజ్ లో తెలపగా ఈ మ్యాడ్ రెస్పాన్స్ కి థాంక్స్ చెప్తున్నట్టుగా RRR సోషల్ మీడియా వారు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు