తమ తొలి తమిళ చిత్రాన్ని ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

Published on Dec 4, 2022 3:11 pm IST

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ కొత్త తమిళ ప్రాజెక్ట్‌కి సంతకం చేసింది. రఘు తథా అనే టైటిల్‌తో, ఈ సంవత్సరం KGF 2 మరియు కాంతార వంటి ఘన విజయాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ యొక్క మొదటి తమిళ వెంచర్ ను షురూ చేయడం జరిగింది.

సుమన్ కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. విప్లవాత్మకమైన డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఎంఎస్ భాస్కర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీత దర్శకుడు కాగా, యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :