నాని 24 కి భారీ బడ్జెట్ !

Published on Feb 6, 2019 1:30 am IST


నాని ఇప్పటివరకు నటించిన చిత్రాలకు 30 కోట్లకు మించి ఎక్కవ బడ్జెట్ కాలేదు. కాని ఇప్పుడు నిర్మాతలు ఏకంగా 50కోట్లు బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం షూటింగ్ ఈనెల 19న ప్రారంభం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి 50కోట్ల బడ్జెట్ కేటాయించారట నిర్మాతలు. దాంతో మనం , 24 చిత్రాలతో మెప్పించిన విక్రమ్ కుమార్ ఫై ఈ సారి ఒత్తిడి ఎక్కువగానే వుండనుంది. మరి ఈ మొత్తాన్ని రాబట్టాలంటే సినిమా కి బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న ‘జెర్సీ’ శాటిలైట్ హక్కులు కాకుండా 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈచిత్రం హిట్ అయితే నాని మార్కెట్ భారీగా పెరగనుంది. దాంతో నాని 24 కూడా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. మరి నాని జెర్సీ తో హిట్ కొట్టి ఒత్తిడిని తగ్గించుకుంటాడో లేదో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :