ఖైదీ వేడుకకు భారీగా తరలి వస్తున్న అభిమానులు !
Published on Jan 7, 2017 4:49 pm IST

khai
విజయవాడ – గుంటూరుల మధ్య ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న హాయ్ ల్యాండ్ ప్రాంతం భారీ జన సందోహంతో కోలాహలంగా మారిపోయింది. చిరంజీవి 8 ఏళ్ల తరువాత రీ ఇస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రల నలుమూలల నుండి అభిమానులు తరలివచ్చారు. ముందుగా ఊహించిన దానికంటే జనాభా మరీ ఎక్కువ కావడంతో నిర్వాహకులు మరింత అప్రమత్తమై ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

చిరంజీవి విజయవాడలో అడుగు పెట్టడంతోనే ఒక్కసారిగా హడావుడి మొదలైంది. అభిమానులు దారి పొడవునా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి చిరంజీవికి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలంతా హై ల్యాండ్ కు చేరుకోగా మిగిలిన వారు, ఇతర ప్రముఖులు, అతిధులు ఒక్కొక్కరిగా హాయ్ ల్యాండ్ చేరుకుంటున్నారు. దీంతో స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 :30 ల నుండి వేడుక మొదలుకానుంది.

 
Like us on Facebook