చైతూ లేకుండా బతకలేనంటున్న సమంత!
Published on Oct 26, 2016 8:18 pm IST

naga-chatanya-samantha
అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోనున్న ఈ ప్రేమ జంట ఇప్పటికి తమ రిలేషన్‌షిప్‌లో ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. టాలీవుడ్‌లో హాట్ టాపిక్స్‌లో ఒకటిగా ఈ ప్రేమ జంట ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా నాగ చైతన్యపై తనకున్న ప్రేమను సమంత మరోసారి పంచుకుంటూ చైతూ లేకపోతే బతకలేనంటూ సమాధానమిచ్చారు.

ఈ సాయంత్రం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సమంత, ‘ఇవి లేకుండా బతకలేను అనుకునే ఒక మూడు విషయాలను చెప్పండి?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చై (అంటే నాగ చైతన్య), మస్కటీ ఐస్‍క్రీమ్, పని.. ఈ మూడూ లేకుంటే బతకలేనని సమాధానమిచ్చారు. దీన్నిబట్టి ఈ ప్రేమజంట ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారో స్పష్టమవుతోంది. ఇక ప్రస్తుతానికి విశాల్ సినిమాలో మాత్రమే నటిస్తున్నాని, తెలుగులో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదని సమంత అభిమానులతో చాట్ సందర్భంగా తెలిపారు.

 
Like us on Facebook