ఇంటర్వ్యూ : రావు రమేష్ – మా నాన్నగారిలా నటిస్తే ఎవరూ చూడరు !

ఇంటర్వ్యూ : రావు రమేష్ – మా నాన్నగారిలా నటిస్తే ఎవరూ చూడరు !

Published on Dec 17, 2016 6:10 PM IST

rao-ramesh-m
ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో భిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు రావు రమేష్. అటు పాజిటివ్ రోల్ కానీ ఇటు నెగెటివ్ రోల్ కానీ అవలీలగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అయన తాజాగా చేసిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. ఈ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచి ఆయనకు మరోసారి మంచి పేరును తెచ్చింది. ఈ పాత్రకు, సినిమాకు సంబందించిన విశేషాలను అయన మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమాలో మీ పాత్రకు మంచి స్పందన వస్తోంది. మీ ఫీలింగ్ ఏమిటి ?
జ) ఈ సినిమాలో నా పాత్రను చూసిన ప్రతి ఒక్క తండ్రి తమని తాము లైవ్ లో చూసుకున్నామని ఫోన్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా ఒక రచయిత ఫోన్ చేసి సర్ ఇక మీకు బంగారు పెన్నుతో వెండి పేపర్ల మీద డైలాగులు రాయాలి అన్నారు. ఆ మాట నాకో పెద్ద గౌరవంలా అనిపించింది.

ప్ర) ఈ పాత్ర మీ దగ్గరకు ఎలా వచ్చింది ?
జ) ‘సినిమా చూపిస్తా మామ’ సినిమా కంటే ముందే ఈ కథ నా దగ్గరచ్చింది. ఈ పాత్ర గురించి చెబుతూ డైరెక్టర్ ఇంకో 5 ఏళ్ల వరకు ఇలాంటి పాత్ర ఇండస్ట్రీలో పుట్టదు సర్ అన్నాడు. అప్పుడు ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అది నిజమే అనిపిస్తోంది.

ప్ర) మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా ?
జ) అవును.. నేనే కాదు ప్రతి తండ్రి ఇలానే ఉంటాడు. కొడుకుతో కన్నా కూతురితోనే తండ్రికి ఎక్కువ రిలేషన్ ఉంటుంది. నాక్కూడా మా అమ్మాయితో ఎక్కువ రిలేషన్. మా అమ్మాయిని అమ్మ అనే పిలుస్తాను. ఏది అడిగినా సరే అంటాను.

ప్ర) అటు పాజిటివ్, ఇటు నెగెటివ్ రెండు వేరియేషన్స్ చూపించడం కష్టంగా లేదా ?

జ) కష్టం ఉంటుంది. ఒక పాత్ర చేసినప్పుడు కాసేపు అదే మోడ్ లో ఉండిపోతాం. కానీ సెట్లో ఆ టైమ్ కి డైరెక్టర్ చెప్పేది కరెక్టుగా క్యాచ్ చేసి ఆ మోడ్ లోకి వెళ్లగలిగితే డైరెక్టర్ అనుకున్న ఔట్ ఫుట్ ఇవ్వచ్చు.

ప్ర) మీకు నెగెటివ్ పాత్రలు ఇష్ట్టమా.. పాజిటివ్ పాత్రలో ఇష్టమా ?

జ) రెండూ ఇష్టమే. కానీ నెగెటివ్ రోల్స్ అంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాటిలో నటించడానికి ఎక్కువ అవకాశముంటుంది.

ప్ర) మీరు నటించేటప్పుడు మీ నాన్నగారు రావుగోపాల్ రావుగారి ప్రభావం మీ మీద ఉంటుందా ?

జ) ఆయన మా నాన్న కాబట్టి ఆయన లక్షణాలు, మూమెంట్స్ కొన్ని నాలో స్వతహాగానే ఉంటాయి. కానీ నేను కావాలని ఆయన్ని ఇమిటేట్ చేయను. ఒకవేళ అది సరిగా రాకపోతే ఎవరూ చూడరు. పైగా అవన్నీ ఎందుకని విమర్శలు కూడా వస్తాయి.

ప్ర) ప్రస్తుతం ఏ సినిమాలో చేస్తున్నారు ?
జ) నేను ప్రస్తుతం అల్లు అర్జున్ డీజే, ఇంకో రెండు సినిమాల్లో నెగెటివ్ రోల్ చేస్తున్నాను. మూడు మంచి సినిమాలు మంచి పాత్రలే. తప్పకుండా సక్సెస్ అవుతాయి.

ప్ర) హీరోయిన్ గురించి చెప్పండి ?
జ) హెబ్బా పటేల్ సెట్లో కానీ బయటకాని అసలు హీరోయిన్ ఉన్నట్టు ఉండదు. చాలా మామూలుగా ఉంటుంది. బాగా నటిస్తుంది. అలాంటి మంచి అమ్మాయికి ఇలాంటి మంచి సక్సెస్ రావడం ఆనందంగా ఉంది.

ప్ర) మరి వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నాయా ?

జ) వేరే భాషా సినిమాలు రెండు వచ్చాయి. కానీ వేరే భాషల్లో సినిమాలు చేయడానికి నేను ఇష్టపడను. మనం తమిళంలోకి వెళితే ఏదో వాళ్ళ డబ్బంతా మనం తింటున్నట్టు చూస్తారు. కేవలం ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే అందరినీ ఆదరిస్తారు. వేరే భాషలు వాళ్ళు అలా చేయరు.

ప్ర) మీకు డ్రీమ్ రోల్స్ అంటూ ఎమన్నా ఉన్నాయా ?
జ) ప్రత్యేకంగా పలనా పాత్ర చేయాలని ఏమీ లేదు. ప్రస్తుతం చాలా పాత్రలు నాకోసమే రాస్తున్నారు. వాటిని నేను మాత్రమే చేయగలిగేలా రాస్తున్నారు. ఆ పాత్రలనే చేసుకుంటూ వెళ్లిపోతుంటాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు