ఇంటర్వ్యూ : రామ్ – అంచనాల గురించి అస్సలు పట్టించుకోను !
Published on Oct 24, 2017 1:53 pm IST


యంగ్ హీరో రామ్ ‘హైపర్’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం జోరుగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు రామ్. వాటిలో భాగంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇది స్నేహం అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా. సినిమా మొత్తం అదే ప్రధానంగా సాగుతుంది. మధ్యలో లవ్ స్టోరీ యాడ్ అవుతుంది. ఇది చిన్నతనం, కాలేజ్ టైమ్, మెచ్యూర్డ్ ఏజ్ అనే మూడు దశల్లో జరుగుతుంది.

ప్ర) ఈ కథను ఎలా చూజ్ చేసుకున్నారు ?
జ) ‘హైపర్’ తర్వాత ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నా సమయంలో ఈ కథ కుదిరింది. వినగానే వెంటనే ఒప్పుకున్నాను.

ప్ర) ‘నేను శైలజ’ తర్వాత కిశోర్ తిరుమలతో చేస్తున్న సినిమా కదా.. అంచనాల సంగతేమిటి ?
జ) నేను అంచనాల్ని అస్సలు పట్టించుకోను. అది దర్శకులు, నిర్మాతల పని. నటించడం వరకే నా పని.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ‘నేను శైలజ’ లోప్ హరి పాత్రకి, ఇందులో అభి పాత్రకి ఎలాంటి పోలికా ఉండదు. వేటికవే భిన్నమైనవి. ఇందులో నాది లైఫ్ అంటే చాలా ఈజీ, మనమే దాన్ని కావాలని కాంప్లికేట్ చేస్తున్నాం అనే భావనతో ఉండే పాత్ర.

ప్ర) ఈ సినిమా కొసమెకొత్త లుక్ ట్రై చేశారా ?
జ) లేదు. ఈ సినిమా కంటే ముందే మేకోవర్ చేసుకుని, నెక్స్ట్ సినిమాకి దాన్నే ట్రై చేద్దాం అనుకున్నాను. అలా ఆ లుక్ ఈ సినిమాకు కుదిరింది.

ప్ర) అనిల్ రావిపూడి సినిమాను ఎందుకు వదులుకున్నారు ?
జ) ఆయనతో సినిమా చేయాలని అనుకున్న మాట వాస్తవమే. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అలా ఆ ప్రాజెక్ట్ కుదరలేదు.

ప్ర) మంచి ప్రాజెక్ట్ మిస్సైపోతే బాధపడుతారా ?
జ) లేదు. ఒకసారి కాదనుకున్న సినిమా గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే అన్నీ ఆలోచించే కథను రిజెక్ట్ చేస్తాను కాబట్టి.

ప్ర) కిశోర్ తిరుమలలో రెండోసారి వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) బాగుంది. మొదటి సినిమాతో కొద్దిగా తెలిశాడు. ఈ సినిమాతో పూర్తిగా అర్థమయ్యాడు. అతనికి భాద్యతల్ని అప్పగించే కొద్దీ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తాడు.

ప్ర) ఈ సినిమాలో హీరోయిన్ల గురించి చెప్పండి ?
జ) ఇందులో అనుపమ, లావణ్య త్రిపాఠి ఇద్దరు హీరోయిన్లు. లావణ్య నిజ జీవితంలో పాత్రకి, సినిమాలో పాత్రకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. కాబట్టి ఆమె ఈజీగా చేసేసింది. ఇక అనుపమ క్యారెక్టర్ అయితే ఆమె రియల్ లైఫ్ కి చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఆమె ఎక్కువ హోమ్ వర్క్ చేయాల్సొచ్చింది. ఇద్దరూ బాగా నటించారు.

ప్ర) దేవిశ్రీ మళ్ళీ మీ సినిమాకు పనిచేయడం ఎలా ఉంది ?
జ) దేవిశ్రీతో చాలా సినిమాలు చేశాను. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దేవి అందించే ఆల్బమ్ మాత్రం ఖచ్చితంగా హిట్టవుతాయి. ఈ సినిమాకి కూడా హిట్ మ్యూజిక్ అందించాడు.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) ఇంకా వేటినీ ఓకే చేయలేదు. ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ వింటున్నాను. ఒప్పుకున్నాక నేనే అఫీషియల్ గా చెప్తాను.

 
Like us on Facebook