ఇంటర్వ్యూ : పాలక్ లల్వాని – అనుష్క శర్మ చేస్తున్న తరహా పాత్రలు చేయాలనుంది !
Published on Feb 19, 2018 4:19 pm IST

రంజిత్, పాలక్ లల్వానిలు జంటగా దర్శకుడు త్రికోటి రూపొందించిన చిత్రం ‘జువ్వ’. ఈ నెల 23న సినిమా విడుదలవుతున్న సందర్బంగా హీరోయిన్ పాలక్ లల్వాని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ఈ సినిమా ఆఫర్ మీకెలా వచ్చింది ?
జ) డైరెక్టర్ త్రికోటిగారు నా మొదటి సినిమా చూసి నన్ను సంప్రదించారు. నాకు కూడ స్టోరీ నచ్చడంతో ఒప్పుకున్నాడు.

ప్ర) ఇంకా మీరు ఏయే సినిమాలు చేశారు ?
జ) సంవత్సరం క్రితం ఈ సినిమా మొదలైంది. షూటింగ్ పూర్తయ్యేనాటికి దేనితో పాటే నేను తమిళంలో జీవీ ప్రకాష్ తో ఒక సినిమా తెలుగులో విశ్వంత్ తో ఒక సినిమా చేశాను. రెండూ రిలీజ్ కావాల్సి ఉంది.

ప్ర) ‘జువ్వ’లో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఒక నార్మల్ అమ్మాయిలనే కనిపిస్తాను. కానీ న చుట్టూ ఉన్న రకరకాల సమస్యలు, పరిస్థితులు నన్ను ఎలా మార్చాయి అనేదే సినిమాలో ముఖ్యమైన అంశం.

ప్ర) మీ న్నాగారు కూడా సినిమా వ్యక్తే కదా .. మీకెలాంటి సలహాలిచ్చేవారు ?
జ) మా నాన్నగారు హిందీ సీరియల్స్ లో పనిచేసేవారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నాకు ఎలా కష్టపడి పనిచేయాలో నేర్పించారు.

ప్ర) మీ హీరో రంజిత్ గురించి చెప్పండి ?
జ) సినిమా ఆరంభమైనప్పటి నుండి అతను కొత్త విషయాల్ని నేర్చుకుంటూ చాలా డెవెలప్ అయ్యారు.

ప్ర) మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది ?
జ) నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. స్త్రీ సాధికారిత గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అనుష్క శర్మ చేసే బలమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి డైరెక్టర్స్ చెప్పిన మంచి పాత్రలు చేస్తాను.

ప్ర) ఈ సినిమా మిమల్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళుతుంది అనుకుంటున్నారా ?
జ) అది ఈ శుక్రవారం తెలిసిపోతుంది. సినిమా అయితే బాగా వచ్చింది. ప్రేక్షకులకి నచ్చుతుందనే నా నమ్మకం. నా కష్టం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది.

 
Like us on Facebook