సౌత్ లో అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను – జాన్వి కపూర్

సౌత్ లో అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను – జాన్వి కపూర్

Published on Nov 3, 2022 2:09 AM IST


దివంగత స్టార్ కథానాయక శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ లేటెస్ట్ గా నటించిన సినిమా మిలి. ఇటీవల మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన హెలెన్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన మిలి మూవీ ని మత్తుకుట్టి జేవియర్ తెరకెక్కించారు. నవంబర్ 4 న ఈ మూవీ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సందర్భంగా నేడు హైదరాబాదులో ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా తండ్రి బోనికపూర్ తో కలిసి విచ్చేశారు జాన్వి కపూర్.

అందులో భాగంగా జరిగిన మీడియా మీట్ లో జాన్వి కపూర్ మాట్లాడుతూ, తనకు సౌత్ సినిమాలంటే ఎంతో ఇష్టమని అలానే తాను కూడా సౌత్ లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ నటులందరూ తనకు ఇష్టమేనని అయితే ఎన్టీఆర్ తో నటించాలనేది తన డ్రీమ్ అని, ఆయన ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకొచ్చారు జాన్వి. మరి సౌత్ లో నటించే అవకాశం జాన్విని ఎప్పుడు వరిస్తుందో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు