‘ఇద్దరి లోకం ఒకటే’ నవంబర్ లోనేనా ?

‘ఇద్దరి లోకం ఒకటే’ నవంబర్ లోనేనా ?

Published on Oct 8, 2019 3:00 AM IST

IddariLokamOkate

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు