ఎట్టకేలకు హిట్ కొట్టిన ఇలియానా!
Published on Aug 21, 2016 12:46 pm IST

ileana
ఇలియానా.. తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్ సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా మెరిసిన స్టార్ హీరోయిన్. అయితే బాలీవుడ్‌లో ఆమె కెరీర్ మొదట్లో బాగానే ఉన్నా, ఆ తర్వాత పూర్తిగా పడిపోయింది. కొద్దికాలంగా ఇలియానాకు గుర్తింపు తెచ్చే సినిమా బాలీవుడ్‌లో పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఆమె ఆశలన్నీ రెండు వారాల క్రిందటే విడుదలైన రుస్తోమ్ పైనే పెట్టుకున్నారు. ఇక ఆమె అశలన్నింటినీ నిజం చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో వచ్చిన బాక్సాఫీస్ హిట్స్‌లో టాప్ 4లో ప్రస్తుతం ‘రుస్తోమ్’ సినిమా కొనసాగుతోంది. ఇప్పటికీ కలెక్షన్స్ దూకుడు అలాగే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న హిట్ దక్కడంతో ఇలియానా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించారు.

 
Like us on Facebook