“పుష్ప” పై అతడు చెప్పిన అప్డేట్ లేనట్టేనా.?

Published on Sep 22, 2021 3:34 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ ఆ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియన్ లెవెల్లో సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ వచ్చి పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ హిందీ వెర్షన్ ని ఆలపించిన బాలీవుడ్ స్టార్ సింగర్ కమ్ కంపోజర్ విశాల్ దద్లాని అప్పుడే పుష్ప సెకండ్ సింగిల్ పై హింట్ ఇచ్చాడు. అది కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే ఉంటుందని అని కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ నెలలో అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇంకా నెల ముగియడానికి కూడా కొన్ని రోజులే బ్యాలన్స్ ఉండడంతో ఇక నెలలో అతడు చెప్పిన అప్డేట్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి అయితే పుష్ప సెకండ్ సింగిల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి దీనిపై మిగిలిన రోజుల్లో ఏమన్నా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :