ఏదైనా దిల్ రాజు తిరిగొచ్చాకే తేలుతుంది !
Published on Oct 24, 2017 6:43 pm IST

తెలుగులో చిన్న సినిమాల దగ్గర్నుండి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని రకాల స్థాయిల్లో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ నిర్మతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్రస్తుతం సౌత్ ఇండియాలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శంకర్, కమల్ హాసన్ ల ‘ఇండియన్ -2’ ను నిర్మిస్తారంటూ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దిల్ రాజు సౌత్ ఇండియాలోని బడా నిర్మాతలు లిస్టులోకి వెళ్లిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంలేదని, ఆ ప్రాజెక్ట్ నిర్మాణం మరొక పెద్ద సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేతిలోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు టీమ్ మాత్రం అలాంటిదేం లేదని, దిల్ రాజుగారి ఆ సినిమాను నిర్మిస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో ఇంతకీ ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాత ఎవరో పూర్తిస్థాయిలో తెలీక ప్రేక్షకులు కొద్దిగా కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ప్రస్తుతం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా విషయమై విదేశాల్లో ఉన్న దిల్ రాజుగారు తిరిగిరావాల్సిందే.

 
Like us on Facebook