“అనిమల్” ఓటిటి వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“అనిమల్” ఓటిటి వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Dec 24, 2023 11:02 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన రీసెంట్ హిట్ చిత్రం “అనిమల్”. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం హిందీ సహా తెలుగులో రాణించింది. అలాఇ యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్ళని అందుకున్న ఈ చిత్రం ఇపుడు బాక్సాఫీస్ దగ్గర కొత్త రిలీజ్ లతో ఎండ్ రన్ కి వచ్చింది.

ఇక అంతా నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ సినిమా అందులో రానున్న జనవరి 26 నుంచి అయితే అందుబాటులో ఉంటుంది అని రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ఓటిటి వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి రివీల్ అయ్యింది.

దర్శకుడు సందీప్ వంగ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిమల్ అడిషనల్ వెర్షన్ ని కన్ఫర్మ్ చేసాడు. ఓటిటిలో ఎక్స్ట్రా రన్ టైం తో అనిమల్ వస్తుంది అని తెలిపాడు. దాదాపు 8 నుంచి 9 నిమిషాలు ఎక్స్ట్రా రన్ టైం ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు