పునర్జన్మల నేపథ్యంలో రాజమౌళి సినిమా.. నిజమేనా ?
Published on Jun 4, 2018 4:34 pm IST

జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో ప్లాన్ చేసిన మల్టీ స్టారర్ యొక్క స్క్రిప్ట్ ను రూపొందించే పనిలో ఉన్నారు.’బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆరంభం నుండే రకరకాల ఊహా గానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్న ఈ చిత్రంలో చరణ్ పోలీస్ పాత్రలో, తారక్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తారని బలమైన వార్తలు వినిపించగా ఇప్పుడు మరొక ఆసక్తికరమైన రూమర్ ఒకటి టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందనేదే ఆ పుకారు యొక్క సారాంశం. ఈ వార్త నిజమో కాదో తేల్చి చేప్పే ఖచ్చితమైన సమాచారమైతే ఇంకా ఎక్కడా బయటకురాలేదు. మరోవైపు అభిమానులు రాజమౌళి గత సినిమాల్లో మైలురాళ్లుగా నిలిచిపోయిన ‘మగధీర, ఈగ’ వంటివి పునర్జన్మల కాన్సెప్ట్ తోనే రూపొందటంతో ఈ మల్టీ స్టారర్ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని భావిస్తున్నారు.

మరి ఏది నిజమో, ఏది పుకారో తెలియాలంటే రాజమౌళి హీరోలిద్దరికీ కథ చెప్పి, ప్రేక్షకుల కోసం ఏదైనా హింట్ వదిలే వరకు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook