“సర్కారు వారి పాట” పై ఇంట్రెస్టింగ్ రూమర్స్.!

Published on Mar 23, 2022 7:02 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి కూడా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అయితే ఆల్రెడీ భారీ రెస్పాన్స్ తో అందరి ప్లే లిస్ట్ ని రూల్ చేస్తుండగా మరికొన్ని ఆసక్తికరమైన గాసిప్స్ ఈ చిత్రంపై వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం నుంచి రానున్న రోజుల్లో మరికొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయట. బహుశా ఉగాది పండుగకు మంచి ట్రీట్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి కూడా ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం అయితే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వస్తారని కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :