యాక్షన్ హీరోకు పోటీగా రాబోతున్న స్టార్ హీరో భార్య !

Published on Aug 1, 2018 8:43 am IST

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ కీలకమైన పాత్రను పోషిస్తుండగా తమిళ్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబరు 18వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోఫ్తా మీడియా వర్క్స్‌ పతాకం పై ధనుంజయన్‌ గోవింద్‌ నిర్మిస్తున్నారు.

కాగా అక్టోబరు 18వ తేదీన హీరో విశాల్‌ నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సండైకోళీ–2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే విశాల్ వెల్లడించారు. అయినా యాక్షన్ హీరో విశాల్ చిత్రానికి పోటీగా జ్యోతిక చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే జ్యోతిక ఫ్యామిలీలోని సభ్యులైన ‘హీరో కార్తి’తో విశాల్ కు చక్కని అనుభందం ఉంది, అయినా ఇద్దరు తమ చిత్రాలను పోటీగా ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో అక్టోబరు 18న తేలనుంది.

సంబంధిత సమాచారం :

X
More