రజినీ నెక్స్ట్ లో శివ కార్తికేయన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Jun 12, 2022 9:32 pm IST


పాన్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనౌన్సమెంట్ ఇచ్చిన తర్వాత సాలిడ్ హైప్ ఈ చిత్రంపై నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై గత కొన్నాళ్ల నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ లు బయటకి వచ్చాయి. వాటిలో అయితే యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు శివ కార్తికేయన్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ రజినీకి యంగర్ వెర్షన్ గా అంటే యంగ్ రజినీకాంత్ లా ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :