‘ఎన్టీఆర్’తో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్ ?

‘ఎన్టీఆర్’తో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్ ?

Published on Dec 26, 2022 10:05 PM IST

కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. అందుకే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పైనే ఉంది. పైగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందట.

కాబట్టి.. ఆ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ ను నటింపజేయాలని, ముఖ్యంగా అమీర్ ఖాన్ లాంటి నటుడు అయితే, ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రశాంత్ నీల్ ఫీల్ అవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు