మహేష్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త !

Published on Aug 1, 2018 3:10 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే సన్నివేశాలు ఉన్నాయట. ఐతే ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఈ చిత్రంలో రెండు వేరు వేరు లుక్స్ లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More