ఇంటర్వ్యూ : కమల్ హాసన్ – విశ్వరూపం-2 ఫస్ట్ పార్ట్ కంటే బాగుంటుంది !
Published on Aug 2, 2018 11:54 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ ఈనెల 10న విడుదలవుతున్న సంధర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం …

ఈ చిత్రం విశ్వరూపం కి కొనసాగింపా?

అవునండి మొదట విశ్వరూపం కథ అనుకున్నప్పుడే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని డిసైడ్ అయ్యాము. మొదటి భాగం ముగిసిన తరువాత దానికి కొనసాగింపుగానే ఈ రెండవ భాగం మొదలవుతుంది.

షూటింగ్ మొదలయి నాలుగేళ్లు అవుతుంది కదా, అప్పటికి, ఇప్పటికకీ మార్పులు ఏమైనా చేసారా?

లేదండి మెజారిటీ సినిమాలో చాలా పోర్షన్స్ అంతే ఉంటాయి. దాదాపుగా అవే షూట్ చేసిన సన్నివేశాలను ఉంచడం జరిగింది. కాకపోతే అక్కడక్కడా చిన్న షాట్స్ కి ప్యాచెస్ ఇవ్వడం జరిగింది.

అపుడు మీరు రాజకీయాల్లోకి రావలి అనుకుని ఈ సినిమాని కొంత పక్కన పెట్టారు కదా, అయితే కథాపరంగా ఏమైనా కుదించడం జరిగిందా?

అటువంటిది ఏమి లేదండి, ఈ కథను కుదించడానికి వీలు పడదు. మేము అనుకున్న ప్రకారం కొంచెం లేట్ అయినప్పటికీ అన్ని సీన్లు కథాప్రకారమే తీసాము. ఏ ఒక్కటి కూడా డైల్యూట్ చేయడం జరగలేదు.

ఈ సెకండ్ పార్ట్ ఇండియాలోనే జరుగుతుంది అని అంటున్నారు, నిజమేనా?

అవునండి అది మేము మొదటి పార్ట్ లోనే హింట్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టూ ఇండియా అని సినిమా చివరిలో చెప్పడం జరిగింది కదా, దాని ప్రకారమే ఈ పార్ట్ సాగుతుంది…

మొదటి భాగం వివాదాల్లో ఇరుక్కుంది కదా, మరి ఈ భాగం ఎలా ఉండనుంది?

లేదండి ఈ పార్ట్ సినిమా మొదలయినప్పటినుండి కూడా మీకు దాదాపుగా ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా చూసుకున్నాం. అది రేపు సినిమా చూసిన వాళ్లకు తెలుస్తుంది…

మొదటి భాగంలో యాక్షన్ పార్ట్ బాగా ఆకట్టుకుంది, మరి ఈ భాగంలో ఎలావుంటుంది?

మన భారతీయ సినిమా ఇదివరకులా చూసిన అవే యాక్షన్ మరియు ఫైటింగ్ సన్నివేశాలు ఎక్కువ కనపడడం లేదు. మనం కూడా మన స్థాయిని దాటేసి ఇంటర్నేషనల్ స్థాయిని అందుకునేలా దూసుకెళ్తున్నాం. దాదాపు నాలుగేళ్లపాటు సాగిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు చూసిన దానిని బట్టి చెప్తున్నాను. ఇది అందరికి యాక్షన్ పరంగా ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పగలను, స్టెంట్ మాస్టర్లు అంతలా కష్టపడ్డారు.

సినిమాలో హీరోయిన్స్ గురించి చెప్పండి?

మొదటి భాగానికి దీనికి సంబంధించి ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో రకరకాల షేడ్స్ తో హీరోయిన్స్ పాత్రలు సాగుతాయి. సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేయడంలో వారిద్దరూ న్యాయం చేసారు అని చెప్పుకోవాలి.

సినిమాలో వహీదా రహమాన్ గారి గురించి చెప్పండి?

ఆవిడా పాత్రా చాలా బాగుంటుంది. ఆవిడ తల్లి పాత్రా చేస్తున్నారు, హీరో ఎక్కడ నేర్చుకున్నాడు పాత్రతో ముడిపడి ఉంటుంది.

సినిమాని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మీరు వాళ్ళ నుండి ఎటువంటి స్పందన ఆశిస్తున్నారు?

ఎవరైనా సినిమా బాగుండాలనే తీస్తారు. ఒకసారి ప్రేక్షకుడు సినిమా నచ్చి తాను ఫీల్ అయితే చాలు మేము విజయం సాధించినట్లు, వాళ్ళతో కలిసి కూర్చుని సినిమా చూసి వాళ్ళు విజిల్స్ వేసేటపుడు ఆ ఆనందం చూస్తే మనకి కడుపు నిండుతుంది. నేను కోరుకునేది అదే..

ఇకపై సినిమాలు తగ్గిస్తారా?

అంతేకదండి మరి. ప్రేక్షకులు నాకు ఇచ్చిన పేరు, డబ్బు, ఖ్యాతిని మొత్తం తిరిగి వారికి ఇచ్చేయడం నా బాధ్యత. అందుకే రాజకీయాల్లోకి వచ్చి, వారి ఋణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను.

ఈ కథ మీరు 2005లో రాసుకున్నాను అన్నారు. మీ దగ్గర ఉన్న కథలతో రాబోయే రోజుల్లో ఎవరితో అయినా సినిమా తీస్తారా?

ఇండియాలో వందకోట్ల ప్రజల్లో కొన్ని వేలమంది అద్భుత నటులు వున్నారు. వారు చేస్తున్నదానిని కాదని మళ్ళి నేను వాళ్ళతో సినిమా ఎందుకండీ చేయడం. అంత మంచి నటులను వారి వారి జీవితాంతం సినిమాలు ఆనందంగా చేసుకోనివ్వండి అంటూ నవ్వుతూ చెప్పారు.

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook